అనంతసాగరం మండలం లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అదే గ్రామంలో ప్రదీప్ కు రెండేళ్ల క్రితం నగదు అప్పుగా ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీధర్ నెల్లూరులో ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. 20 రోజుల క్రితం గ్రామానికి వచ్చి నగదు ఇవ్వమని కోరగా వాగ్వాదం జరిగింది. ప్రదీప్ తో పాటు అతని తండ్రి, సోదరుడు కర్రలతో శ్రీధర్ పై దాడికి యత్నించారు. బాధితుడు అనంతసాగరం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.