నెల్లూరు జిల్లా, ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయం సమీపంలో శుక్రవారం నాగుపాము కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కార్యాలయం ప్రహరీ గోడ వద్ద నీటి పైపుల మరమ్మతులు చేస్తుండగా పాము రావడంతో ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఒక వ్యక్తి చాకచక్యంగా పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు.