ఆత్మకూరు: భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆత్మహత్య

ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో ప్రవీణ్ (25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా, మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్