విద్యార్థుల్లో తెల్లవారుజామున నిద్ర లేచి చదివే అలవాటును పెంపొందించడానికి చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయులు చల్లా చంద్రశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో ప్రతి ఉదయం గం. 5:30 కు గణిత ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకు అందరూ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇచ్చిన వారిని ఆరోజు 'మార్నింగ్ స్టార్'గా ప్రకటించి వారితో ఫోటో దిగి పెన్ను బహుమతిగా ఇస్తున్నారు. తమ పిల్లలు తెల్లవారుజామున నిద్రలేచి చదవడం పట్ల తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.