ఆత్మకూరు: మనిషి ప్రాణం తీసిన పింఛన్ నగదు

ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో సోమవారం విషాద ఘటన జరిగింది. గ్రామంలోని దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తండ్రితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన చేతిలోని కర్రతో కుమారుడుపై పుల్లయ్య దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్