ఆత్మకూరు: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ఆత్మకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లూరి జిల్లాకు చెందిన రాంప్రసాద్ (20) ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చాడు. బుధవారం వింజమూరు మండలం నల్లగొండ్లలో విద్యుత్ పనుల కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రాంప్రసాద్‌తో కలిసి వచ్చిన ఇతర యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనికి పిలిపించిన కాంట్రాక్టర్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్