ఓటిఎపై స్ అవగాహన కార్యక్రమం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటిఎస్ విధానం ఎంతో మేలని మండల ప్రత్యేక అధికారి ప్రసాద్ తెలిపారు.చేజర్ల మండలం లోని యనమదల సచివాలయంలో యంస్ ఓ ప్రసాద్ సచివాలయం సిబ్బందితో మంగళం వారం ఓటిఎస్ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓటి ఎస్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. గ్రామంలో హౌసింగ్ రుణాలతో ఇల్లు నిరించుకున్న లబ్ధిదారులకు ఓటిఎస్ ద్వారా 10వేలు చెల్లిస్తే రుణ విముక్తి కల్పిస్తు ఇంటి పై సంపూర్ణ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ, దౌలత్, విర్వో ఓ కోటేశ్వరరావు, విఓఏ లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ వాలింటీర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕