ఆత్మకూరు సీఐ గంగాధర్ శనివారం రాత్రి బోయిల చిరివెళ్ల, యడవల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వేసవిలో గ్రామాల్లో జరిగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.