తూర్పు కనుపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి కలువాయి మండలంలోని బంధువుల కార్యక్రమానికి బైక్‌పై వెళ్తుండగా, చేజర్ల మండలం ఆదురుపల్లి ఆదురుమ్మ గుడి సమీపంలో బైక్ నుంచి కింద పడిపోయారు. ఈ దుర్ఘటనలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి మృతితో కుమారుడు శ్రీకాంత్ తీవ్రంగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.