గౌరవవేతనం పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు డిమాండ్ చేశారు. చేజర్ల తహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని, కనీస గౌరవ వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.