చేజర్ల: గొల్లపల్లిలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా, చేజర్ల మండలం, గొల్లపల్లి గ్రామంలో ఎమ్మార్వో ఆర్. మస్తానయ్య చేతుల మీదుగా రైతులకు శుక్రవారం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ రీసర్వేతో భూ రికార్డులు మరింత పారదర్శకంగా మారాయని, తద్వారా రైతులకు భూహక్కులపై భరోసా పెరిగిందని అధికారులు తెలిపారు. రైతులు తమ రెవిన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్