నెల్లూరు సిపిఎం నేత పెంచలయ్య హత్యకు ఆత్మకూరులో చేపట్టిన నిరసన ఆందోళనకు దారి తీసింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరిన సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంతసేపు గందరగోళం పరిస్థితి నెలకొంది. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఈ బందుకు సహకరించవలసిందిగా సిపిఎం నాయకులు పోలీసులను విజ్ఞప్తి చేశారు. అన్యాయంగా ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.