సంగం మండలం మర్రిపాడులో పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గొల్లపల్లి హజరత్తయ్య ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాను పగులగొట్టి సుమారు రూ. 70 వేల నగదును అపహరించారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.