శ్రీ శాకాంబరీ అలంకరణలో పార్వతమ్మ అమ్మవారు

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని రాపూరు పట్టణ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రాత్రి శ్రీ పార్వతమ్మవారు శాకాంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్