కండలేరు డ్యామ్లో వ్యక్తి గల్లంతు

చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి సమీపంలోని కండలేరు డ్యామ్ లో విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన కొల్లపనాయుడుపల్లి అరుంధతివాడకు చెందిన కొమ్మల శివకోటయ్య ప్రమాదవశాత్తు నీటిలో జారి మునిగిపోయి గల్లంతయ్యాడు. అతనితో పాటు వెళ్లిన వారు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్