నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం డిప్యూటీ ఎంపీడీవోగా నూతనంగా ఎన్. మణిరత్నం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గూడూరులోని డిఎల్పిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్ పై ఏఎస్పేట డిప్యూటీ ఎంపీడీవో గా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను కార్యాలయ సిబ్బంది సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.