మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో గురువారం పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ అరికట్ల జనార్ధన్ నాయుడు, మండల టిడిపి కన్వీనర్ దేవరాల గంగాధర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల కోసం చేస్తున్న సంక్షేమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. పేరెంట్స్ డే సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.