శనివారం మర్రిపాడు మండలం కృష్ణాపురం హైవే వద్ద రోడ్డు దాటుతున్న బైక్‌ను మరో వాహనం ఢీకొనడంతో వెంకటయ్య, తిరుపయ్య అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వింజమూరు నుంచి బద్వేలు వైపు వెళ్తున్న వీరిని 1033 హైవే అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.