రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి 74 వ జన్మదిన వేడుకలు ఆత్మకూరులో గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్థానికులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లోనూ మంత్రి పుట్టినరోజు వేడుకలు అద్భుతంగా నిర్వహించారు.