అనంతసాగరం మండలం చిలకల మర్రిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ పరిశీలించారు. ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొలతల ప్రకారం పని చేస్తే రోజువారి కూలి రూ. 307 గిట్టుబాటు అవుతుందని ఆ దిశగా పనులు చేయాలని సూచించారు. తొందరగా వచ్చి పనులు ముగించుకొని వెళ్లడం మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి రామచంద్రయ్య, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.