కందుకూరు ఎంఈఓగా నాగ కుమార శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. చినగంజం ఎంఈఓ అజయ్ బాబు ఇన్ని రోజులు కందుకూరు ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన స్థానంలో నాగ కుమార శర్మను ఎంఈఓగా నియమించారు. అయితే ఈయనను ఎఫ్ఏసీగా నియమించారు. సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు జడ్పీ హైస్కూల్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న శర్మకు కందుకూరు ఎంఈఓగా బాధ్యతలను అదనంగా అప్పగించారు.