కేతుగ్రాస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంను మంగళవారం ఆలయ సిబ్బంది మూసివేశారు. గ్రహణం కారణంగా భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి, యథావిధిగా శ్రీవార్ల దర్శనం భక్తులకు కల్పిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.