ఏఎస్‌పేట మండల కేంద్రంలోని తూర్పు వీధి సాయిబాబా గుడి పరిసరాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంగం సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు జిలానీ భాష, భోజ్యనాయక్‌తో పాటు సిబ్బంది పాల్గొని, 25 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని పత్రాలను పరిశీలించారు. ప్రజలకు భద్రతా జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.