సంగం: గుప్త నిధుల కోసం తవ్వకాలు

నెల్లూరు జిల్లా సంగం మండలంలో గుప్తనిధుల కోసం కొండపై భారీగా తవ్వకాలు జరిగాయి. మేకల కాపరి గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, ఎల్ ఆకారంలో సుమారు 100 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై పి. రాజేష్, గ్రామస్థులతో కలిసి పరిశీలించి, అటవీశాఖకు సమాచారం అందించారు. ఆగంతకులు పరారయ్యారు.

సంబంధిత పోస్ట్