సంగం మండలం కొరిమెర్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన యువకులను కొరిమెర్ల గ్రామానికి చెందిన వికాస్, వీరేంద్రగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేశ్ ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.