రాజంపేటకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను వింజమూరుకు చెందిన కొందరు వ్యక్తులు 'మీ తల్లిదండ్రులు మా దగ్గర ఉన్నారు' అని నమ్మించి, మోసం చేసి బాతులు మేపే పనిలో పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంగం మండలం కొత్త వంగల్లు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అనుమానం వచ్చి, ఆ ఇద్దరు చిన్నారులను గుర్తించి సంగం పోలీసులకు అప్పగించాడు. చిన్నారుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు, వారిని త్వరలోనే తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.