నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయం వద్ద కొందరు పర్యాటకులు ప్రమాదకర ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పెన్నా డెల్టాకు నీటి విడుదల కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో పలువురు యువకులు నీటిలోకి వెళ్లి ఈత కొడుతూ సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు, అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.