మర్రిపాడు మండలం నెల్లూరు - ముంబయి హైవేపై కోనసముద్రం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బైక్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.