యువ కార్మికుడి దుర్మరణం

వెంకటాచలం మండలం గోలగమూడి గ్రామానికి చెందిన ఎన్. సుధీర్ (20) పైప్‌లైన్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బుచ్చి తాగునీటి పైప్‌లైన్ పనుల నిమిత్తం గాంధీజన సంఘం సమీపంలో పనిచేస్తుండగా, హైడ్రా క్రేన్‌కు కట్టిన తాడు అతని కాళ్లకు చిక్కడంతో కిందపడిపోయాడు. అదే సమయంలో క్రేన్ డ్రైవర్ ముందుకు నడపడంతో సుధీర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్