గురువారం ఉదయం కందుకూరు సమీపంలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి మాచవరం గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆనందాపురం అడ్డ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారందరినీ వెంటనే కందుకూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.