బైక్ అదుపుతప్పి బోల్తా: ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మంగళవారం రాత్రి కందుకూరు మండలం కొండముడుసుపాలెం హైవే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ నుంచి కడప వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, అతన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్