కందుకూరు అంబటి దిష్టి బొమ్మ దహనం

చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కందుకూరులో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలు ఖండనీయమని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్