అడవిరాజుపాలెం అడవిలో కోడి పందాలు – ఇద్దరు అరెస్ట్

గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం అడవిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు పందెం కోళ్లు, రూ. 2,120 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్