ఇండోసోల్ కంపెనీకి సంబంధించి కరేడు ప్రాంత భూముల సేకరణలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉలవపాడు (మం) కరేడు పంచాయతీ, టెంకాయచెట్లపాలెంలో సోమవారం సాయంత్రం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భూ సేకరణ గురించి ప్రస్తావించగా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని, న్యాయమే జరుగుతుందన్నారు.