కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులకు బొట్లగుంట శ్రీనివాసులు ఇంటి పైకప్పు ఎగిరిపోయి, ఇల్లు పూర్తిగా కూలిపోయింది. రేకులు చెల్లాచెదురవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు నేలమట్టం కావడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అధికారులు తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు.