లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి కసిరెడ్డి పెంచలయ్యకు చెందిన పొగాకు బ్యారెన్ అగ్నిప్రమాదానికి గురైంది. క్యూరింగ్ జరుగుతున్న సమయంలో పొగాకు అల్లిక కర్ర మొద్దుగొట్టంపై పడటంతో మంటలు చెలరేగినట్లు బాధితుడు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నారు.