కందుకూరు పట్టణంలోని 9వ వార్డు ప్రకాశం కాలనీ, రెవెన్యూ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 22.5 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో మూడు రోడ్లు నిర్మించనున్నారు. దీంతో స్థానికుల రోడ్డు సమస్యలు తీరనున్నాయి. గత 20 నెలల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు.