కందుకూరు టిడిపి కార్యాలయంలో గురువారం 36 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని, సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదవారి కోసం ఆరోగ్య శ్రీ పరిధిలో రాని వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం చేస్తున్నారన్నారు.