ఇంటి నుంచి వెళ్లిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయాడు. కందుకూరు మండలంలోని పందలపాడుకు చెందిన కంజుల వెంకట సుబ్బారెడ్డి (82) గత నెల 28వ తేదీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువుల దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. డ్రోన్ తో గ్రామ సమీపంలో వెతికించినా కనిపించలేదు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం సక్రమంగా లేక గతంలోనూ ఇలానే వెళ్లి తిరిగి వచ్చినట్లు గ్రామస్తులు అన్నారు.