ఉపాధ్యాయుల క్షేమం కోసమే కాకుండా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడితేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ఏపీయుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. కందుకూర్ లో జరుగుతున్న జిల్లా స్థాయి శిక్షణ తరగతులలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎన్ని పోరాటాలు చేసిన ప్రభుత్వంలో చలనం లేదన్నారు.