కందుకూరు: లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి

లారీ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కందుకూరు గ్రామీణ ఎస్ఐ బాల మహేంద్ర నాయక్ వివరాల ప్రకారం సింగరాయకొండ బాలాజీ నగర్ కు చెందిన తమ్మిశెట్టి రామయ్య(67) కందుకూరు వచ్చి బైక్ పై తిరిగి వెళుతున్నాడు. ఓవి రహదారిలోని లారీ ఆఫీస్ ఎదురుగా ఉన్న వే బ్రిడ్జి నుంచి లారీ స్టాండ్ లోకి వెళ్లే సమయంలో రామయ్యను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్