కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు శుక్రవారం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, సీఎం చంద్రబాబు ప్రతి పేద కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సమీక్ష కందుకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగింది.