కందుకూరు: కుక్క అడ్డు రావడంతో స్కిడ్… హెడ్ కానిస్టేబుల్ మృతి

కందుకూరులోని సింహాద్రి నగర్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జంపాల వెంకటరమణయ్య శనివారం సాయంత్రం ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భాగ్యనగర్ మూడో లైన్‌లో బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్