కందుకూరు: నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కందుకూరు పట్టణంలో గురువారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ పర్యటించారు. మూడో నంబర్ రేషన్ షాప్ వద్ద తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలతో పెద్ద నష్టం తప్పిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు రకాల వస్తువులు అందజేశారు. బాధితుల అవసరాలు తీరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్