సొంతూరులో పెన్షన్లు పంపిణీ చేసిన కందుకూరు ఎమ్మెల్యే

వలేటివారిపాలెం మండలంలోని తన స్వగ్రామం బడేవారిపాలెంలో ముగ్గురికి కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా శుక్రవారం సాయంత్రం పంపిణీ చేశారు. పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల సీఎం చంద్రబాబు పెన్షన్ అందజేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్