కందుకూరు: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

కందుకూరు మండలం పాలూరు దొండపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్