కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం కందుకూరు పట్టణంలోని ఓవి రోడ్డులో గల బీసీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న భోజన నాణ్యత, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఇదే సందర్భంగా హాస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేసి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.