కందుకూరు: పొగాకు అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కందుకూరు పామూరు రోడ్డులోని 27వ నెంబర్ పొగాకు వేలం కేంద్రంలో అమ్మకాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఇంటూరి పూజలు నిర్వహించి వేలాన్ని ప్రారంభించారు. తొలిరోజు అమ్మపాలెం గ్రామం నుంచి 18 బేళ్లు వేలానికి రాగా, కిలోకు రూ. 250 ప్రారంభ ధర నమోదైంది. రైతుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు సానుకూలంగా వ్యవహరించి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ఏడాది పంట నాణ్యత మెరుగ్గా ఉందని, గత ఏడాదికంటే మంచి ధరలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్