రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ఇస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. కందుకూరు పట్టణంలోని టెక్కలి పాలెం, వెంకటనారాయణ బజార్ ప్రాంతాల్లో బుధవారం సుపరిపాలలో తొలి అడుగు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.