కందుకూరు: దొండపాడులో పింఛన్ల పంపిణీ

కందుకూరు నియోజకవర్గంలోని దొండపాడు ST కాలనీలో శుక్రవారం NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని, త్వరలో రామతీర్థం జలాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్